అఖండ సినిమా ప్రమోషన్స్ సమయంలో బోయపాటి ఎలాంటి సోలో ఇంటర్వూస్ కానీ, ప్రెస్ మీట్స్ లో కానీ పాల్గొనకుండా కేవలం గ్రూప్ ఇంటర్వ్యూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కనిపించారు. ఇప్పుడు బోయపాటి స్కంద ప్రమోషన్స్ లోను అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారట. రామ్-శ్రీలీల మాత్రమే స్కంద ఇంటర్వూస్ కనిపించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ ఇంటర్వూస్ మొదలు పెట్టేసారు.
కానీ బోయపాటి మాత్రం సోలోగా ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వరట. రిలీజ్ కి ముందు మీడియా ఎదుటకు రారని తెలుస్తుంది. స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉన్నా బోయపాటి సక్సెస్ మీట్ లో మాత్రమే కనిపించే ఛాన్స్ ఉంది.. అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇది నిజమే అనిపిస్తుంది.
ఎందుకంటే స్కంద రిలీజ్ కి కేవలం మూడు రోజులు మాత్రంమే సమయం ఉంది. ఈలోపులో బోయపాటి కనిపించకపోయినా పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పటివరకు ఆయన స్కంద కి సంబంధించి ఏ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా కూడా ఎక్కడా కనిపించలేదు. మరి అందుకేనేమో చాలా లేట్ గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. అలా అయితే బ్లాక్ బస్టర్ కొట్టెయ్యొచ్చు.. అఖండకి అదే జరిగింది అని సెంటిమెంట్ గా భావిస్తున్నారేమో బోయపాటి.