రేపు గురువారం సెప్టెంబర్ 28 న విడుదల కావాల్సిన సలార్ మూవీని మేకర్స్ పోస్ట్ చేసారు. అది ఎప్పటివరకు అనేది క్లారిటీ ఇవ్వకుండా అభిమానులని కన్ఫ్యూజన్ లో పెట్టేసారు. అయితే కొంతమంది నవంబర్ లో, డిసెంబర్ లో సలార్ రిలీజ్ ఉండొచ్చు అంటున్నారు. మరికొంతమంది డైనోసార్ వచ్చే సంక్రాంతికి రాబోతుంది అంటున్నారు. అసలు ఈ ఏడాది సలార్ వచ్చే ఛాన్స్ లేదు, అందుకే మేకర్స్ ఇప్పటివరకు డేట్ లాక్ చెయ్యలేదు. ఈ ఏడాది అయితే ఖచ్చితంగా డేట్ లాక్ చేసే వారే.
ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఆరు నెలలు ముందే రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి. అందుకే సలార్ ని వచ్చే ఏడాది అంటే 2024 మార్చ్ మూడో వారంలో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అని మేకర్స్ ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారట. ఇక అటు సీజి వర్క్ కంప్లీట్ అయ్యాక అవుట్ ఫుట్ చూసాకే ఈ కొత్త డేట్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారట.
ప్రభాస్ బర్త్ డే రోజు వరకు సలార్ కొత్త డేట్ ఇవ్వరు, ఆ రోజునప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా కొత్త పోస్టర్ ఒకటి ఇచ్చి దానితో పాటుగా రిలీజ్ డేట్ చెబుతారు, ఆ రోజు ట్రైలర్ కూడా వచ్చే ఛాన్స్ లేదు అంటున్నారు. మరి ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ డ్యామేజ్ ని సలార్ తో పోగొట్టుకుందామనుకుంటే.. అది ఏడాది రావడానికి సిద్ధంగా లేదు.