ఈమధ్యన శ్రీలీల వరస సినిమాల్తో క్షణం తీరిక లేని బిజీ లైఫ్ ని గడుపుతుంది. ఈ నెల అంటే సెప్టెంబర్ 28 నుంచి శ్రీలీల సినిమాలు వరసగా ఆరు నెలలు సందడి చెయ్యబోతున్నాయి. ఏకంగా పది ప్రాజెక్ట్స్ శ్రీలీల చేతిలో ఉన్నాయి. రామ్ తో కలిసి స్కంద తో రేపు గురువారమే ఆడియన్స్ ముందుకు రాబోతున్న శ్రీలీల ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వదిలేసుకుంది అనే టాక్ నడుస్తుంది.
అందులో ఒకటి రవితేజ-గోపీచంద్ మలినేని మూవీ అంటున్నారు. శ్రీలీల తప్పుకోవడంతోనే ఆ ప్లేస్ లోకి నేషనల్ క్రష్ రశ్మిక వచ్చి చేరిందట. అయితే శ్రీలీల ఆమె ఒప్పుకున్న సినిమాల్తో డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక రవితేజ సినిమా వదులుకున్నట్లుగా తెలుస్తోంది. అందులోని నవంబర్, డిసెంబర్ రెండు నెలలు ఆమెకి ఎగ్జామ్స్ టైమ్ కావడంతో ఆమె షూటింగ్స్ అన్ని పక్కనబెట్టయ్యబోతుందట.
సో శ్రీలీల ఈఛాన్సు వదులుకోవడంతో రవితేజ ఛాన్స్ ని లక్కీగా రష్మిక పట్టేసిందట. రశ్మిక ఎంతైనా లక్కీ కదా.. అందుకే ఇలా రవితేజ సినిమాలో ఆమెకి సడన్ గా ఛాన్స్ దొరికేసింది.