మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్రాంతి మోడ్ లో కనిపిస్తున్నారు. మోకాలి ఆపరేషన్ తర్వాత ఆయన పెద్దగా బయట కనిపించింది లేదు. వినాయకచవితికి ఆయన ఇంట్లోనే మనవరాలు, కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్ అయినప్పుడు ప్రత్యేకంగా అభినందించారు తప్ప ఆయన పెద్దగా పబ్లిక్ లోకి రావడంలేదు. ఆగష్టు 22 కే అయన కొత్త సినిమాల కబుర్లు అందించింది. ఆ సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తాయో అర్ధం కావడం లేదు.
అయితే మెగాస్టార్ చిరంజీవి మెగా 156 ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన కుమర్తె సుస్మిత నిర్మాతగా చేస్తారని అన్నారు. కానీ కుమర్తె తో సినిమా ప్రకటించినా.. అక్కడ దర్శకుడిగా కళ్యాణ్ కృష్ణని లాక్ చెయ్యలేదు. ఇప్పుడు మెగా 156 స్థానంలోకి దర్శకుడు వసిష్ఠ వచ్చాడు అంటున్నారు. అసలైతే వసిస్ట-చిరు కలయికలో రాబోయే మూవీ మెగా 157 గా ఉండాల్సి ఉంది. కానీ ఇప్పుడు మెగా 156 గా వసిష్ఠ మూవీ ఉండబోతుందట.
ఇక ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారని అందులో నయనతార, అనుష్క హీరోయిన్స్ గా ఫిక్స్ అంటున్నారు. కానీ మేకర్స్ అఫీషియల్ ఎవరిని లాక్ చెయ్యలేదు. ఇక వసిష్ఠ తో మెగాస్టార్ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్ లేదా డిసెంబర్ నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది.. అని తెలుస్తోంది.