చాలామంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకునేటప్పుడు కుటుంభ సభ్యులు, స్నేహితులు మిగతా ప్రముఖులని కూడా పెళ్ళికి పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు గ్రాండ్ గా పెళ్లి చేసుకుని అందరికి పార్టీ ఇచ్చేవారు. ఆ పెళ్లి ఫొటోస్ ని, ఎవరెవరు ఆ పెళ్ళికి వచ్చారో అనేవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులని ఆనందపరిచేవారు. కానీ ఇప్పుడలా కాదు. పెళ్ళికి పిలుస్తున్నారు. అది కూడా కొద్దిమంది ముఖ్యమైన వారిని మాత్రమే. అంతేకాకుండా పెళ్ళిళ్ల ఫొటోస్, వీడియోస్, మిగతా ఈవెంట్స్ ని ఓటిటీలకి అమ్మేసుకుంటున్నారు. అందుకే ఎలాంటి ఫొటోస్ వారు ఇచ్చేవరకు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెళ్ళిళ్ళకి వెళ్లేవారి సెల్ ఫోన్స్ ని కూడా పక్కన పెట్టెయ్యాలని కోడ్ పెట్టేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ లో పరిణీతి-రాఘవ్ చద్దాల పెళ్లి వేడుకలు మొదలైపోయాయి రాజస్థాన్ లో వీరి వివాహానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరిణీతి హీరోయిన్. రాఘవ్ పొలిటికల్ లీడర్. దానితో వీరి వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు హాజరవుతారు. అయితే పరిణీతి-రాఘవ్ ల వివాహానికి వచ్చేవారు సెల్ ఫోన్ తీసుకురాకూడదనే రూల్ పెట్టారన్నారు.
కానీ తాజాగా సెల్ ఫోన్ భద్రపరచడమనేది బావుండదు. అందుకే ఫోన్ కెమెరాలకు ఓ టేప్ అతికిస్తారట. ఎలాంటి ఫోటో తియ్యకుండా, పెళ్లి ఫోటోలు లీక్ చెయ్యకుండా ఉండేందుకు పెళ్ళికి హాజరయ్యే వారి సెల్ ఫోన్స్ కి టేపు ఒకటి అతికిస్తారట. మరి టేప్ తీసేసి ఫొటోస్ క్లిక్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ అలా టేప్ తియ్యగానే.. ఒక యారో మార్క్ పడుతుందట. అంటే వాళ్ళు బయటికొచ్చేటప్పుడు ఫోన్ చెక్ చేసి పంపిస్తే అందులో ఫొటోస్ ఉంటే డిలేట్ చేసెయ్యాలి.
ఈ ప్రాసెస్ అంతా పెద్ద సెలబ్రిటీస్ కి అవమానమే. వారు చిన్న చితక సెలెబ్రిటీస్ కాదు.. టాప్ సెలబ్రిటీస్. మరి అంత పెద్ద వాళ్ళని పిలిచి ఫోన్స్ కి టేప్ అతికిస్తామంటే వారు అవమానంగా భావించరూ. ఇప్పుడు దీని మీదే బాలీవుడ్ మీడియాలో చర్చ మొదలయ్యింది.