నేడు నార్కోటిక్ పోలీసుల ముందుకు హీరో నవదీప్ వచ్చిన దృశ్యాలు మీడియాలో హైలెట్ అయ్యాయి. మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లోని డ్రగ్స్ కేసులో A29 గా హీరో నవదీప్ ఉన్న విషయం తెలిసిందే. నవదీప్ స్నేహితుడు, డ్రగ్స్ సప్లయర్ రామచందర్‌తో నవదీప్‌కు ఉన్న సంబంధాలు, ఆటను మరకద్రవ్యాలు సేవించాడనే అనుమానంతో నార్కోటిక్ పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.
అంతేకాకుండా నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు ఈరోజు విచారణలో నార్కోటిక్ పోలీసులు నవదీప్ ని ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం నవదీప్ ని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. సప్లయర్ రామచందర్ పట్టుబడినప్పటి నుంచి హీరో నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెల్ పిటిషన్ కొట్టేసి 41 ఏసీఆర్‌పీసీ కింద విచారణకు హాజరు కావాలని నవదీప్‌కు హైకోర్టు సూచించింది. ఆదేశాల నేపథ్యంలో నవదీప్‌కు 41 ఏసీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు..