Advertisementt

నా పనైపోయిందన్నారు.. వస్తున్నా: మనోజ్

Sat 23rd Sep 2023 11:55 AM
manoj manchu  నా పనైపోయిందన్నారు.. వస్తున్నా: మనోజ్
Manoj Manchu Is Back With A Game Show నా పనైపోయిందన్నారు.. వస్తున్నా: మనోజ్
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ గత కొన్నేళ్ళుగా సినిమాలకి దూరంగా ఉంటున్నాడు. అటు ఫ్యామిలీతో గొడవలు, అన్నతో విభేదాలు, ఇటు మొదటి పెళ్లి విడాకులు, మళ్ళీ ప్రేమ పెళ్లి అంటూ మనోజ్ మీడియాలో కనిపిస్తున్నాడు తప్ప.. సినిమా సెట్స్ లో కనిపించి ఏళ్లయ్యింది. మధ్యలో అహం బ్రహ్మాస్మి అంటూ ప్యాన్ ఇండియా మూవీ ప్రకటించాడు. దానికి సంబందించిన మరో అప్ డేట్ ఇప్పటివరకు లేదు. అసలు మనోజ్ ఇకపై సినిమాలు చెయ్యడు, అతను నిర్మాతగా మారుతున్నాడు, కాదు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. 

అయితే మంచు మనోజ్ పనైపోయింది అన్నవారికి దిమ్మతిరిగే సమాధానం ఇవ్వబోతున్నాడు. త్వరలోనే ఓ సరికొత్త గేమ్ షో తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్టుగా గ్రాండ్ గా ఎనౌన్స్ చేసాడు. ఓటిటి సంస్థ ఈటివి విన్ కోసం ర్యాంప్ ఆడిద్దాం అంటూ బయలు దేరాడు. దానికి సంబందించిన ప్రోమోతోపాటుగా మంచు మనోజ్ ఇలా ట్వీట్ చేసాడు. 

Priyamiyna abhimanula kosam,

Tirigosthunna koncham kothaga, Sarikothaga ramp adiyadaniki…

YOUR ROCKING STAR IS BACK WITH A GAME SHOW!

అంటూ ఆ ప్రోమోలో నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచి సినిమా మీద పెంచుకున్న ప్రేమ ప్రొఫెషన్ గా మారింది. నన్ను హీరోని చేసింది, నటుడిగా నిలబెట్టింది. రాకింగ్ స్టార్ అనే గుర్తింపునిచ్చింది. ఫాన్స్ విజిల్స్, అరుపులు, కేకలు ఇలా పండగలాంటి నా జీవితంలోకి సడన్ గా ఓ సైలెన్స్ వచ్చింది. మనోజ్ పనైపోయింది, కెరీర్ ఖతం, ఇకపై యాక్టింగ్ చెయ్యడు అన్నారు. ఎనర్జీ స్టార్ లో ఎనర్జీ తగ్గింది అన్నారు. విన్నాను, చూసాను, భరించాను, వస్తున్నాను, తిరిగొస్తున్నాను అంటూ మంచు మనోజ్ వదిలిన ఈప్రోమో వైరల్ గా మారింది.  

Manoj Manchu Is Back With A Game Show :

Manoj Manchu Is Back With A Game Show For ETV Win

Tags:   MANOJ MANCHU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ