గత పది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న హీరో నవదీప్ ఫైనల్లీ ఈరోజు నార్కోటిక్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కాబోతున్నాడు. మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్ లో జరిగిన పార్టీలో నవదీప్ అతని స్నేహితుడు రాంచంద్ లు డ్రగ్స్ సేవించినట్టుగా నార్కోటిక్ పోలీసులు కనిపెట్టారు. ఈ కేసులో నవదీప్ ని 29 వ నిందుతుడిగా చేర్చారు. నవదీప్ ఫ్రెండ్ రాంచంద్ పట్టుబడడమే కాకుండా విచారణలో అతను నవదీప్ పేరు కూడా బయటపెట్టడంతో పోలీసులు నవదీప్ ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు.
కానీ నవదీప్ నార్కోటిక్ పోలీసులకి చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కి అప్లై చేసాడు. కోర్టు కొద్దిరోజులు నవదీప్ ని అరెస్ట్ చెయ్యొద్దు అని చెప్పి ఆ తర్వాత విచారణలో నవదీప్ గతంలోనూ పలుమార్లు డ్రగ్స్ కేసు విచారణ లో పాల్గొన్న కారణంగా కోర్టు నవదీప్ కి నార్కోటిక్ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు ఆదేశించింది. దానితో పోలీసులు నవదీప్ కి నోటీసులు ఇచ్చారు.
ఈరోజు సెప్టెంబర్ 23 న నవదీప్ ని విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపారు. దానితో నవదీప్ అజ్ఞాతం వీడాల్సి వస్తుంది. ఇక ఈ రోజు విచారణలో నవదీప్ ని స్నేహితులతో కలిసి డ్రగ్స్ సేవించడం, డ్రగ్స్ ఎవరి ద్వారా కొనుగోలు చేసారు అని ఇంకా మిగతా విషయాలని విచారణలో అడగబోతున్నట్లుగా తెలుస్తుంది.