Advertisementt

అంతా నాగార్జున చేతుల్లోనే

Sat 23rd Sep 2023 09:59 AM
bigg boss 7  అంతా నాగార్జున చేతుల్లోనే
Everything is in Nagarjuna hands అంతా నాగార్జున చేతుల్లోనే
Advertisement
Ads by CJ

 

నిన్న శుక్రవారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఇద్దరమ్మాయిల చేతిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ యావర్ బకరా అయ్యాడు. యావర్ ప్రిన్స్, శోభా శెట్టి, ప్రియాంకల మధ్యలో మూడో పవర్ అస్త్ర కోసం కంటెండర్లుగా పోటీ పడింది. అందులో మెజారిటీతో ఏ ఒక్కరు ఈ పోటీకి అనర్హులో చెప్పమంటే శోభా ప్రిన్స్ పేరు చెప్పింది, ప్రిన్స్ శోభా శెట్టి పేరు చెప్పాడు. ఫైనల్ డెసిషన్ ప్రియాంక చేతుల్లోకి వెళ్ళింది. దానితో ఆమె యావర్ యాంగ్రీ నెస్ తట్టుకోలేమంటూ అతన్ని తీసెయ్యడంతో యావర్ కి చాలా కోపం వచ్చింది.

ఆ కోపంలో ప్రియాంకతో గొడవ పెట్టుకోవడమే కాకుండా.. చేతిలోని సుత్తితో అక్కడే ఉన్న తన డాల్ తో పాటుగా టేబుల్ ని పగలగొట్టాడు.  దానితో సంచాలక్ సందీప్ కి కోపం వచ్చింది. బిగ్ బాస్ ప్రోపర్టీని ఎందుకు డ్యామేజ్ చేస్తున్నావంటూ గొడవపడ్డాడు. నీవు నీ బిహేవియర్ అంటూ సందీప్ కూడా గట్టిగా అరిచేసాడు.

మూడో పవర్ అస్త్ర తనకి రాలేదన్న కోపమే కాదు.. ప్రిన్స్ తనకి అసలు డబ్బుల్లేవు.. నాకు ఈ బిగ్ బాస్ చాలా ఇంపార్టెంట్ కానీ తోక్కేస్తున్నారు. 0 బాలన్స్ నాది. ఇక్కడికి వచ్చేముందు అకౌంట్ లోకి డబ్బులొచ్చాయి. అప్పటివరకు 0 బ్యాలెన్స్ నా అకౌంట్ లో అంటూ శివాజీ దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక శోభా శెట్టి-ప్రియాంకకి మధ్యన ఫైనల్ ఫైట్ బుల్ బుల్ రైడ్ జరిగింది. అందులో ఎవరు గెలిచారో అనేది ఈరోజు నాగార్జున గారు శనివారం ఎపిసోడ్ లో రివీల్ చేస్తారు. అంటే అంతా నాగార్జున చేతుల్లో ఉన్నట్టేగా.. 

Everything is in Nagarjuna hands:

Bigg Boss 7: Friday episode highlights

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ