ఏప్రిల్ 28న విడుదలై ప్రేక్షకుల నుంచి తిరస్కరించబడిన అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ మొదటి రోజుకే థియేటర్స్ లో బిషణా ఎత్తేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు ముందు ఉన్న హైప్ విడుదల తర్వాత వచ్చిన నెగెటివ్ టాక్ తో పోవడమే కాదు.. ఏజెంట్ తో నిర్మాతలు భారీ నష్టాలని చవి చూడాల్సి వచ్చింది. ప్రోపర్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ మీదకి వెళ్లడంతో ఫెయిల్ అయ్యామని అనిల్ సుంకర వివరణ ఇచ్చుకున్నారు.
ఇక థియేటర్స్ లో ఫెయిల్ అయిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటీలోకి వస్తుందా.. అసలు ఏజెంట్ ని ఇంతిలా ప్రేక్షకులు తిరస్కరించడానికి కారణాలేమిటో అని తెలుసుకుందామని చాలామంది ఏజెంట్ ని ఓటిటిలో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ చిత్ర డిజిటల్ హక్కులు దక్కించుకున్న సోని లివ్ మాత్రం ఏజెంట్ ని స్ట్రీమింగ్ చెయ్యడానికి ఐదు నెలలుగా వెయిట్ చేస్తుంది. ఈమద్యలో ఏజెంట్ ఎడిటింగ్ వెర్షన్ ఓటిటిలోకి వస్తుంది అనే ప్రచారం ఒకటి.
ఇక ఇన్ని నెలలుగా వెయిట్ చేయించి చేయించి ఐదు నెలల దురు చూపులతో ఫైనల్ గా ఏజెంట్ మూవీని ఈనెల 29 న సోని లివ్ లో ప్రసారం చేస్తున్నట్టుగా ప్రకటించారు. అది చూసిన కొంతమంది పాతగాయాన్ని రేపుతున్నారు, అక్కినేని అభిమానులకు మరోసారి మనస్తాపం కలిగిస్తున్నారు, మొత్తానికి మోక్షం కలిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.