Advertisementt

ఫైనల్లీ ప్రమోషన్స్ స్టార్ట్

Fri 22nd Sep 2023 04:33 PM
ram skanda  ఫైనల్లీ ప్రమోషన్స్ స్టార్ట్
Finally promotions start ఫైనల్లీ ప్రమోషన్స్ స్టార్ట్
Advertisement
Ads by CJ

ఈరోజు వరకు స్కంద మూవీ ప్రమోషన్స్ పై సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడిచింది. స్కంద మూవీ విడుదలకు వారం కూడా లేదు.. ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు, రామ్ ఏమో.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ లో బిజీగా వున్నాడు, స్కంద ప్రమోషన్స్ లైట్ తీసుకుంటున్నాడు, బోయపాటి మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ లో బాగా బిజీగా ఉన్నాడు. రామ్ కూడా పట్టించుకోవడం లేదనే చర్చ నడవడం కాదు, రామ్ అభిమానులు ఆందోళన పడ్డారు. 

ఫైనల్లీ నేడు శుక్రవారం నుంచి రామ్ ట్రెడిషనల్ గా స్కంద ప్రమోషన్స్ ని తన హీరోయిన్ శ్రీలీలతో కలిసి మొదలు పెట్టేసాడు. ఛానల్స్ లో ఇంటర్వూస్, అలాగే సోలో ఇంటర్వ్యూ మొదలు పెట్టేసారు. ఇకపోతే మీడియా మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్, రేపు 23 న రిలీజ్ ట్రైలర్ ఇలా ఊపిరి తీసుకోకుండా రామ్ అండ్ ఇంకా చిత్ర బృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది. 

ఇదే గనక మరో వారం ముందు మొదలు పెట్టినట్లయితే స్కంద ఇంకా ప్రేక్షకుల్లోకి వెళ్ళేది. అసలే అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న చిత్రం కాబట్టి ఆ అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఆ అంచనాలు ఈ ప్రమోషన్స్ మరికాస్త పెంచుతాయి. 

Finally promotions start:

Ram Skanda promotions start

Tags:   RAM SKANDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ