Advertisementt

గుంటూరు కారం కోసం సూపర్ స్టార్ కష్టాలు

Fri 22nd Sep 2023 01:21 PM
guntur karam  గుంటూరు కారం కోసం సూపర్ స్టార్ కష్టాలు
Shooting - 12-15 Hours a Day for Guntur Karam గుంటూరు కారం కోసం సూపర్ స్టార్ కష్టాలు
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నమొన్నటివరకు గుంటూరు కారం షూటింగ్ ని ఆడుతూ పాడుతూ అంటే నాలుగు వెకేషన్స్, మూడు గుంటూరు కారం షెడ్యూల్స్ అంటూ కూల్ గా చేసుకుంటూ కనిపించారు. కానీ ఇప్పుడు గుంటూరు కారం అనుకున్న సమయానికి విడుదల కావాలంటే కష్టపడక తప్పదు. 

మొన్నటివరకు టెక్నీకల్ ఇబ్బందులు, హీరోయిన్ గొడవ కూడా కాస్త సమస్యగానే మారింది. కాని ఇప్పడు అవేమి లేవు. అంతా సర్దుకోవడంతో మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ కి సహకరిస్తున్నారు. ఉదయం 7 గంటలకే సెట్స్ కి వెళుతున్న మహేష్ రాత్రి 9 గంటల వరకు షూటింగ్ చేస్తున్నారట. అలాగే చిన్న విరామం కూడా లేకుండా షూటింగ్ కి హాజరవడంతో గుంటూరు కారం సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ అవ్వదు.. అనుకున్న సమయానికే ఆడియన్స్ ముందుకు వస్తుంది అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ జూబ్లీ హిల్స్ ఏరియాలో జరుగుతుంది. సకాలంలో షూటింగ్ పూర్తి చేసి మహేష్ బాబు అటు రాజమౌళి సినిమా సెట్స్ లోకి వెళ్ళిపోవాలి. అందుకే గుంటూరు కారం షూటింగ్ త్వరగా ఫినిష్ చేసేందుకు మహేష్ చాలా కష్టపడుతున్నారట. 

Shooting - 12-15 Hours a Day for Guntur Karam:

Guntur Karam update 

Tags:   GUNTUR KARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ