బిగ్ బాస్ సీజన్ 7 లో మూడో పవర్ అస్త్ర కోసం బిగ్ ఫైట్ జరిగింది. తనని కంటెండర్ గా పనికిరావు అన్నవారితో ఛాలెంజ్ చేసి వారు పెట్టిన పరిక్షలో నెగ్గి ప్రిన్స్ రియల్ హీరోగా నిలిచాడు. దామిని, తేజ, రతిక ముగ్గురు ప్రిన్స్ ని ఓడించలేక చేతులెత్తేశారు. ఇక శోభా శెట్టి విషయంలో బిగ్ బాస్ ఏదో ప్లాన్ చేసాడనిపించింది. శోభా శెట్టికి గౌతమ్, పల్లవి ప్రశాంత్, సుబ్బు కి మధ్యలో చికెన్ టాస్క్ పెట్టాడు.
అందులో శోభా కన్నా ఎవ్వరు ఎక్కువ చికెన్ తింటే వారే కంటెండర్ అన్నారు. గౌతమ్ గబగబా తినేసాడు. కానీ సంచాలక్ సందీప్ మాస్టర్ గౌతమ్ చిన్న ముక్క తినలేదు అన్న కారణంగా శోభాశెట్టి కంటెండర్ అని బిగ్ బాస్ ప్రకటించాడు. తర్వాత ప్రియాంక-అమరదీప్ పోటీ పడగా జుట్టు కత్తిరించాల్సి రావడంతో ప్రియాంక హెయిర్ కట్ చేసుకుని దానితో అక్కడ ప్రియాంక కంటెండర్ అయ్యింది. అయితే ఈ ముగ్గురిలో మెజారిటితో ఎవరు వీకెస్ట్ కంటెండర్ అని భావిస్తారో ఒకరిని తీసెయ్యని అనగానే శోభా శెట్టి-ప్రియాంక ఇద్దరూ కలిసి ప్రిన్స్ యావర్ పేరు చెప్పారు.
దానితో ప్రిన్స్ చాలా డిస్పాయింట్ అయ్యి యాంగ్రీగా అరిచేసాడు. ప్రియాంకపై ఫైర్ అయ్యాడు. నేను చాలా స్ట్రాంగ్ అంటూ తెగ రెచ్చిపోయాడు. అటు శోభా శెట్టి-ప్రియాంక పై ప్రిన్స్ చాలా గొడవ పడ్డాడు. నువ్వెందుకు వేలు చూపిస్తున్నావంటూ ప్రియాంక యావర్ పై రెచ్చిపోయింది. ఎందుకరుస్తున్నావ్ అంటే ఎందుకరుస్తున్నావ్ అంటూ గోల గోల చేసారు. సందీప్ వచ్చి ప్రిన్స్ బిహేవియర్ ని క్వచ్చన్ చేసిన ప్రోమో వైరల్ గా మారింది.