భార్య భర్తలిద్దరూ కొట్టుకుంటుంటే.. వారి మధ్యన తరచూ గొడవలవుతుంటే.. విడిపోయి ఉండడమే మేలు అనుకుంటారు. కానీ ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త జైల్లో ఉంటే ఏ భార్య అయినా ఏం చేస్తుంది. గుడులకి గోపురాలకు, భర్తని విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ, లాయర్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంది. కానీ ఇప్పుడొక భార్య భర్త జైల్లో ఉంటే బయట ఫొటోస్ షూట్స్, ఇన్స్టా రీల్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంది.
ఆమె ఎవరో కాదు.. మహాలక్ష్మి. కోలీవుడ్ నటి మహాలక్ష్మి-నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందమైన మహాలక్ష్మి భారీ ఖాయమైన రవీందర్ ని వివాహము చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆమె అతన్ని పెళ్లాడింది రవీందర్ డబ్బు చూసే అనుకున్నారు. అన్నారు. నిజంగానే మహాలక్ష్మి రవీందర్ ని వివాహం చేసుకోవడం అందరికి షాకిచ్చే విషయమే. అయితే ఇప్పడు రవీందర్ చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అలాంటప్పుడు మహాలక్ష్మి ఎలా ఉండాలి.
కానీ ఆమె ఎలా ఉండాలో అలా ఉండకుండా.. రివర్స్ లో చేస్తుంది. మహాలక్ష్మి నిత్యం ఫోటో షూట్స్ తో కాలక్షేపం చేస్తుంది. అలా అని ఏ సీక్రెట్ గానో కాదు.. ఓపెన్ గా ఫొటో షూట్స్ షేర్ చేస్తూ.. నా మనసు నీకోసమే ఎదురు చూస్తుంది.. అంటూ ఆ ఫొటోస్ కి క్యాప్షన్ పెడుతుంది. మరి చిరునవ్వులు చిందిస్తూ మహాలక్ష్మి ఈ రేంజ్ లో ఫొటోస్ దిగుతుంటే చూసేవారికి ఎలా ఉంటుంది..