హీరో నవదీప్ నార్కోటిక్ పోలీసులు తనని అరెస్ట్ చెయ్యకుండా, తనకి నోటీసులు ఇవ్వకుండా మాదాపూర్ డ్రగ్స్ కేసులో ముందుగానే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న విషయం తెలిసిందే. కానీ నార్కోటిక్ పోలీసులు.. నవదీప్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో స్నేహితుడు రాంచంద్ తో కలిసి డ్రగ్స్ సేవించడమే కాకుండా పలు డ్రగ్స్ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు, అలాగే డ్రగ్స్ విక్రయిస్తున్నాడనే అనుమానంతో అతని ఇంటిని తనిఖీ చేసారు.
కోర్టులో నవదీప్ ని అరెస్ట్ చేసి విచారణచెయ్యాలని, నోటీసులు ఇవ్వాలని వాధించగా.. కోర్టు కూడా నవదీప్ కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులకి అనుమతించింది. దానితో ఈరోజు గురువారం నవదీప్ ఇంటికి వెళ్లి నార్కోటిక్ పోలీసులు నోటీసులు ఇచ్చి వచ్చారు. ఆ నోటీసుల ప్రకారం నవదీప్ ఈనెల 23 న నార్కోటిక్ పోలీసులు ముందుకు విచారణకు హాజరవ్వాల్సి ఉంది.
తాజాగా నవదీప్ కేసు అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది..
మాదాపూర్ డ్రగ్స్ కేస్ లో మరో ముగ్గురికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హై కోర్టు
ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి, స్నార్ట్ పబ్ ఓవర్ సూర్య కు ముందస్తు బెయిల్ మంజూరు
ఈ నెల 26 న గుడిమల్కాపూర్ పోలీసుల ముందు సరెండర్ అవ్వాలని హై కోర్ట్ ఆదేశం, వారిని అరెస్ట్ చేసి బెయిల్ మంజూరు చేయాలని ఆదేశం ప్రతి సోమవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలీసుల ముందు హజరవ్వలని ఆదేశం.