బాలకృష్ణ తో సినిమా చేస్తే ఇలానే చేస్తావా.. ప్రమోషన్స్ ని ఇంత లైట్ తీసుకుంటావా.. ఇప్పుడు రామ్ తో ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పి విడుదలకు దగ్గరయ్యేసరికి.. పరువు పోయేలా చేస్తున్నావు, నీకు బాలయ్య ఒక్కడే హీరోనా.. అంటూ బోయపాటి శ్రీను పై హీరో రామ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏ హీరోతో సినిమా చేసినా.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉండే బోయపాటి రామ్ విషయంలో ఇలా ఎందుకు చేస్తున్నాడు. సమయం లేనప్పుడు రిలీజ్ తేదీ ఇచ్చి ఇంత హడావిడి ఎందుకు. రామ్ తో స్కంద అంటూ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ని అనౌన్స్ చేసి ఇప్పుడు దానికి సరిపోయే ప్రమోషన్స్ లేకుండా చేస్తున్నారు.
స్కంద విడుదలకి కేవలం 7 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ రోజు గురువారం.. వచ్చే గురువారమే స్కంద రిలీజ్. ఫ్రైడే వినాయక నిమజ్జనం హాలిడే.. శని, ఆదివారాలు, సోమవారం అక్టోబర్ 2 గాంధీ జయంతి పబ్లిక్ హాలిడే.. ఇన్ని సెలవలు ఉన్నాయి. పర్ఫెక్ట్ రిలీజ్ కానీ.. సినిమాని అస్సలు ప్రమోట్ చెయ్యడం లేదు అనేది రామ్ అభిమానుల బాధ. అసలే విడుదలైన ట్రైలర్ పై విమర్శలు. ఇలాంటి సమయంలో స్కంద ప్రమోషన్స్ ని పీక్స్ లో ఉంచాల్సింది పోయి.. ఇప్పటివరకు గ్రౌండ్ లోకి దిగలేదు.
సినిమా టాక్ ఎలా ఉంటుందో అనేదానికన్నా ఈ చిత్రం ఓపెనింగ్స్ పై ఈ ప్రమోషన్స్ ప్రభావం ఎంతుంటుంది అనేది ఇప్పుడు అభిమానులని తొలిచేస్తున్న ప్రశ్న. అందుకే వారు బోయపాటి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.