నిజమే సంక్రాంతికి మహెష్ బాబు గుంటూరు కారం-ప్రభాస్ కల్కి మూవీస్ రావనే ధీమాతో మీడియం బడ్జెట్ చిత్రాలు, మరికొంతమంది హీరోలు తమ సినిమాలని సంక్రాంతికి విడుదల చేద్దామని రంగం సిద్ధం చేసుకుంటుంటే.. ఇప్పుడు డైనోసార్ సంక్రాంతికి దిగితే ఎలా ఉంటుంది.. చిన్న, మీడియం హీరోలంతా గప్ చుప్ అవ్వాల్సిందేగా అంటున్నారు.
అదే డైనోసార్ అంటే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సలార్ ని ఈనెల 28 నుంచి పోస్ట్ పోన్ చేసి కొత్త రిలీజ్ డేట్ ఇవ్వకుండా కన్ఫ్యూజన్ లో పెట్టిన మేకర్స్ ఇప్పుడు దీనిని సంక్రాంతికి ఏమైనా విడుదల చేస్తారేమో అనే ఉహాగానాలు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. నవంబర్, డిసెంబర్ అంటూ ప్రచారం జరిగినా ప్యాన్ ఇండియా ఫిలిం కాబట్టి ఈ చిత్ర సంక్రాంతికి విడుదల చేస్తే బావుంటుంది అని మేకర్స్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.
మరి కల్కి సమ్మర్ కి షిఫ్ట్ అయ్యి సలార్ సంక్రాంతికి వస్తే.. చాలా సినిమాలు సంక్రాంతి బరి నుంచి సర్దుకోవాల్సిందే. హోంబ్లే ఫిలిమ్స్ వారు ఆ సలార్ డేట్ ఏదో లాక్ చేస్తే.. సంక్రాంతికి రావాలనుకున్న హనుమాన్, నా సామిరంగా చిత్రాలు దానితో పాటుగా రవితేజ ఈగల్ పునరాలోచనలో పడతాయి.