Advertisementt

అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్ డేట్

Thu 21st Sep 2023 07:57 AM
allu arjun-trivikram movie  అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్ డేట్
Crazy update on Allu Arjun-Trivikram movie అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్ డేట్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా కనిపిస్తున్నాడు. చిన్న విరామం తర్వాత నిన్ననే పుష్ప ద రూల్ ఫ్రెష్ షెడ్యూల్ మొదలైంది. హైద్రాబాద్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలను సుకుమార్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ సందీప్ వంగ తో పాటుగా, త్రివికం శ్రీనివాస్ తో మరో సినిమా ఎనౌన్స్ చేసాడు. ఈ చిత్రంతోనే త్రివిక్రమ్ ప్యాన్ ఇండియా లోకి ఎంటర్ అవుతున్నారు.

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో హ్యాట్రిక్ హిట్ తో ఉండడంతో తదుపరి రాబోయే ప్రాజెక్ట్ పై విపరీతమైన అంచనాలున్నాయి. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది అంటే 2024 ప్రధమార్ధంలోనే షూటింగ్ కి వెళుతుంది అనుకున్నారు. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుంది. దానికి అనుగుణంగా త్రివిక్రమ్ మహేష్ తో గుంటూరు కారం షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలి. ఆ తర్వాత ఆయన అల్లు అర్జున్ మూవీ ప్రీ ప్రొడక్షన్, కథ, స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో పడాలి. దానికోసమే అడపా దడపా ఓ 6 నెలల సమయం కావాలి.

ఈలోపులో అల్లు అర్జున్ కూడా పుష్ప ద రూల్ ని ఆగష్టు లో ప్యాన్ ఇండియా మార్కెట్ లో దించి రిలాక్స్ అవుతాడు. అందుకే త్రివిక్రం-అల్లు అర్జున్ తమ ప్రాజెక్ట్ ని ఆగస్టు తర్వాతే మొదలుపెట్టాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. 

Crazy update on Allu Arjun-Trivikram movie:

Allu Arjun-Trivikram movie update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ