Advertisementt

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రతిక

Wed 20th Sep 2023 03:20 PM
bigg boss rathika is trending on twitter  సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రతిక
Rathika is trending on social media సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రతిక
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 7 లో గ్లామర్ డాల్ లా కాదు గడ్రామా క్వీన్ లా కనిపించే రతిక బిహేవియర్ కి హౌస్ మేట్స్ మాత్రమే కాదు నెటిజెన్స్ కూడా చిరాకు పడుతున్నారు. అనవసరంగా గొడవలు పెట్టుకుని బిగ్ బాస్లో తాను హైలెట్ అయ్యేలా చూసుకుంటుంది. ఫుటేజ్ కోసం ఏమైనా చేస్తుంది. గత వారం గ్రూప్ టాస్క్ లో రతిక వలన గేమ్ ఆగిపోయింది. అయినా ఆమె తగ్గలేదు. డాక్టర్ గౌతమ్ తో గొడవ. 

ఇక గత రాత్రి అంటే మంగళవారం రాత్రి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో ఉత్తిపుణ్యానికి గొడవ పెట్టుకుంది. మాములు రచ్చ కాదు.. తానేదో సోలోగా ఆడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. మొన్న ఎలిమినేట్ అయిన షకీలా కూడా రతిక ని పాముతో పోల్చింది. నామినేషన్స్ లోను గొడవ.. అందరి మీదకి కయ్యానికి కాలు దువ్వుతుంది. ఇక నిన్న రాత్రి నామినేషన్స్ అయ్యాక బాగా ఏడ్చింది. శివాజీ ఓదార్చాడు. 

అందరి చూపు తనపై ఉండాలనుకునే మనస్తత్వం అమ్మడిది. ప్రిన్స్ తో లవ్ ట్రాక్ వేస్తున్న రతిక సీక్రెట్ రూమ్ కి వెళ్లి ప్రిన్స్ కెప్టెన్సీ కంటెండర్ గా పనికిరాడని చెప్పడంతో ప్రిన్స్ బాగా హార్ట్ అయ్యాడు. ఆ తర్వాత రతికని తిట్టాడు. కానీ ఈ రోజు ఎపిసోడ్ లో వీరిద్దరూ కలిసిపోయి ఒకరికొకరు తినిపించుకుంటున్న ప్రోమో వైరల్ గా మారింది. ఇవన్నీ చూసి రతికని మంచికో, చెడుకో సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి పడేస్తున్నారు. 

Rathika is trending on social media:

Bigg Boss Rathika is trending on twitter

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ