Advertisementt

ANR కి చిరు నివాళి

Wed 20th Sep 2023 11:45 AM
chiranjeevi  ANR కి చిరు నివాళి
A Sweet Memory! Chiranjeevi tweet on ANR ANR కి చిరు నివాళి
Advertisement
Ads by CJ

ఈరోజు అక్కినేని నాగేశ్వరరా గారి 100వ శతజయంతి. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున, ANR కుటుంభ సభ్యులు అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  మీదుగా అక్కినేని స్టూడియోస్ లో ఆవిష్కరించారు. ఇక అక్కినేని తో అనుబంధం కలిగి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆయనతో చేసిన మెకానిక్ అల్లుడు సినిమాలోని స్టిల్ ని పోస్ట్ చేస్తూ.. 

శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి  ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి  నివాళులర్పిస్తున్నాను. 🙏🙏 

ఆయన తెలుగు సినిమా కే  కాదు  భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా  బ్రతికినంత వరకు శ్రీ  అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో  ఎప్పటికీ  నిలిచి వుంటారు. 

ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా శ్రీ అక్కినేని  కుటుంబంలోని  ప్రతి ఒక్కరికి ,

నా సోదరుడు @iamnagarjunaకి, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు, 

సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు !! అంటూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

A Sweet Memory! Chiranjeevi tweet on ANR:

Chiranjeevi tweet on ANR

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ