భారీ బడ్జెట్ సినిమాలు చాలావరకు అనుకున్న తేదికి రాలేక పోస్ట్ పోన్ అంటూ అభిమానులని ఇబ్బంది పెట్టి కొత్త రిలీజ్ డేట్స్ ఇస్తూ ఉండడం చాలా కాలం నుంచి నడుస్తున్న ట్రెండే . అందులోను కరోనా, ప్యాన్ ఇండియా అంటూ మొదలు పెట్టాక ఈ రిలీజ్ డేట్స్ తరుచూ మారిపోతున్నాయి
అయితే ఇప్పుడు మహేష్ బాబు ఖచ్చితంగా సంక్రాంతికి గుంటూరు కారంతో రాడని చాలామంది ఫిక్స్ అయినట్లుగా కనబడుతున్నారు. అందుకే తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సకలం సిద్ధం చేస్తున్నారు. త్రివిక్రమ్-మహేష్ బాబు గుంటూరు కారాన్ని సంక్రాంతి బరిలో నిలపలేరు, ఆ సినిమా డేట్ మారుతుంది అని మహేష్ అభిమానులే ఆందోళన పడుతున్నారు. ఆగష్టు 9 న గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ అన్నారు,
ఆఖరికి వినాయకచవితికి హీరో సోలో సాంగ్ అన్నారు.. అదీ లేదు, మళ్ళీ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారు. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మూడు నెలలో షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చెయ్యడం సాధ్యమయ్యే పని కాదు.. అందుకే గుంటూరు కారం డేట్ మారుతుంది అని కొంతమంది(ప్రశాంత్ వర్మ హనుమాన్, రవితేజ ఈగల్, నాగార్జున నా సామిరంగ చిత్రాలు) భావించే తమ సినిమాల ప్రమోషన్స్ ని వినాయకచవితి నుంచి స్టార్ట్ చేసేసారు.
ముఖ్యంగా హనుమాన్, నాగార్జున నా సామీ రంగ చిత్రాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఖచ్చితంగా మహేష్ రాడని ఫిక్స్ అవ్వబట్టే వారు ఈ రేంజ్ ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలు పెట్టేసారు. అన్నట్టు ప్రభాస్ ప్రాజెక్ట్ K కల్కి కూడా 2023 సంక్రాంతికి డౌట్ అంటున్నారు.