చంద్రబాబు అరెస్ట్ పై సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ అవడం లేదు, ఆయన పేరు చెప్పుకుని లబ్ధిపొందిన వారెవరూ నోరు మెదపడం లేదు అంటూ నిర్మాత నట్టికుమర్ సినిమా ఇండస్ట్రీ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అప్పటినుంచి తమ్మారెడ్డి, రాఘవేంద్రరావు లాంటి వారు తప్ప చంద్రబాబు అరెస్ట్ పై ఎవరూ పెద్దగా స్పందించలేదు. తాజాగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబుని ఓ సినిమా ప్రెస్ మీట్ లో మీడియా వారు చంద్రబాబు అరెస్ట్ పై సినిమా ఇండస్ట్రీ స్పందించలేదు ఎందుకు అని ప్రశ్నించారు.
దానికి దగ్గుబాటి సురేష్ మట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉంది. అందుకే సెన్సిటివ్ విషయాలపై చిత్ర పరిశ్రమ నుంచి స్పందన ఉండదు. తెలంగాణ, ఆంధ్ర విషయంలోనూ సినీ పరిశ్రమ స్పందించలేదు. ఇప్పుడు కూడా స్పందిచలేదు.. మా నాన్న, నేను కూడా టిడిపి కి వర్క్ చేశాము, అది మా పర్సనల్..
చిత్ర పరిశ్రమకు చంద్రబాబు గారే కాదు చాలామంది సిఎం లు మంచి చేశారు.. సపోర్ట్ చేసారు.. అంటూ సురేష్ బాబు చంద్ర బాబు అరెస్ట్ పై సినిమా ఇండస్ట్రీ స్పందించకపోవడానికి అసలు కారణాలను చెప్పారు.