యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత గురువారం తన భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలు భార్గవ్, అభయ్ లతో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్ళాడు. అసలైతే ఎన్టీఆర్ అక్కడ జరిగిన సైమా అవార్డ్స్ కోసం దుబాయ్ వెళ్ళాడు. ఆర్.ఆర్.ఆర్ కి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న ఎన్టీఆర్ గత నాలుగు రోజులుగా భార్య పిల్లల్తో దుబాయ్ లోనే ఉన్నాడు. అక్కడే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసాడు.
ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లడంపై టీడీపీ నేతలు, అలాగే కొంతమంది నందమూరి అభిమానులు చాలా హార్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రిమండ్ లో ఉంటే ఎన్టీఆర్ ఇలాంటి ట్రిప్స్ వెళ్లడంపై విమర్శించారు. ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై ఎలాంటి రియాక్షన్ చూపించకపోవడంతో చాలామంది గుర్రుమని ఉన్నారు. అదేమిపట్టించుకొని ఎన్టీఆర్ దుబాయ్ ట్రిప్ ముగించేసేసారు.
గత రాత్రి అంటే నిన్న సోమవారం వినాయకచవితి రోజు రాత్రి 7 గంటలకి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫ్యామిలీతో కనిపించారు. దుబాయ్ ట్రిప్ ముగించుకుని ఎన్టీఆర్ ఆయన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ వచ్చేసిన విజువల్స్ వైరల్ గా మారాయి.