మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య తో విడిపోయి విడిగా తన ఫ్యామిలీతోనే ఉంటుంది. నాగబాబు తన కూతురిని తన దగ్గరే ఉంచుకున్నారు. ఈమధ్యనే వరుణ్ తేజ్, నాగబాబు ఆయన వైఫ్ పద్మజ, నిహారిక ఫ్యామిలీ ట్రిప్ వెళ్లారు. అయితే నిహారిక భర్త తో విడిపోయి విడాకులు తీసుకున్నాక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది. దానితో నిహారికని నెటిజెన్స్ నోటికొచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు.
ముఖ్యంగా యూట్యూబర్ నిఖిల్ తో నిహారిక క్లోజ్ గా ఉండడంపై నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివి చూసే నిహారిక హస్బెండ్ ఆమెకి విడాకులిచ్చాడు అంటూ మాట్లాడుతున్నారు. అయితే నిహారిక-నిఖిల్ కి లింక్ చేస్తూ మాట్లాడిన వాళ్ళకి నిహారిక ఇండైరెక్ట్ గానే బిగ్ షాకిచ్చేసింది. నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఇన్స్టా లో యాంకరింగ్ నుంచి సహా నటుడిగా.. అక్కడినుంచి నిర్మాతగా మారవు. తర్వాత నా చిట్టి తమ్ముడిగా మారవు. మనం కలిసి చాలా దూరం ప్రయాణించాము.
స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్లు కొందరే ఉంటారు. అందులో నువ్వు ఒక్కడివి. లవ్ యు నిక్కీ, గ్రేట్ బర్త్ డే నానా అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అవడమే కాదు.. తనపై, నిఖిల్ పై రూమర్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేసిన వాళ్ళకి నిహారిక ఇలా ఇండైరెక్ట్ గానే గట్టిగా ఇచ్చి పడేసింది.