మెగా ఫ్యామిలీలోకి ఇంకా కోడలిగా అడుగుపెట్టని లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో నిశ్చితార్ధం చేసుకుని కోడలిగా మెగా కుటుంబంలోకి అఫీషియల్ గా వెళ్లబోతుంది. ఇంకా వెళ్ళలేదు. నవంబర్ లో వరుణ్ తేజ్ తో లావణ్య ఏడడుగులు నడిచేందుకు రెడీ అయ్యింది. ఈలోపులోనే లావణ్య నాగబాబు ఫ్యామిలీతో కలిసి వినాయక చవితి రోజున నాగబాబు ఇంట్లోనే చవితి పూజలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
లావణ్య త్రిపాఠి కాబోయే అత్తగారు పద్మజ తో కలిసి స్పెషల్ గా వినాయకుడికి పూజలు నిర్వహించింది. ట్రెడిషనల్ గా సారీ లో స్పెషల్ గా కనిపించిన లావణ్య పూజలు తర్వాత అత్తమామలతో కాబోయే వాడితో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చింది. వరుణ్ తేజ్-లావణ్య, నాగబాబు ఆయన భార్య కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో చూసిన వారంతా ఇంకా పెళ్లి కాకుండానే అత్తారింట్లో పూజలేమిటి లావణ్యా అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం లావణ్య-వరుణ్ తేజ్ ఇద్దరూ కలిసి పెళ్లి షాపింగ్ లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మనీష్ మల్హోత్రా డిజైనర్ షాప్ లో పెళ్లి దుస్తుల సెలెక్షన్ లో ఈ కపుల్ పాల్గొంది.