నిన్నమొన్నటివరకు నందమూరి బాలకృష్ణ.. ఆయన బావ చంద్రబాబు జైల్లో ఉండడంతో టీడీపీ నేతలతో మీటింగ్స్, బావతో ములాఖత్, పవన్ కళ్యాణ్ తో పొత్తు వ్యవహారాలతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. దానితో బాలకృష్ణ భగవంత్ కేసరి షూటింగ్ విషయం పట్టించుకోవడం లేదు అనుకున్నారు. కానీ బాలయ్య లైన్ లోనే ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో భగవంత్ కేసరి చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.
ప్రస్తుతం రామోజీలో బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగతోంది. మరి ఈ షెడ్యూల్ తో షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయినట్లే. అంటే ఇప్పటివరకు నందమూరి అభిమానులు భగవంత్ కేసరి విడుదల తేదీ విషయంలో ఆందోళన పడ్డారు. కానీ ఇప్పుడు ఈ షూటింగ్ అప్ డేట్ చూసాక ఊపిరి పీల్చుకుంటున్నారు.
అటు బాలయ్య ఏపీకి వెళ్లిన సమయంలో అనిల్ రావిపూడి చకచకా పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టేసి డబ్బింగ్ కూడా పూర్తి చేసేసాడు. ఇప్పుడు బాలయ్య అందుబాటులోకి రావడంతో షూటింగ్ ఫినిష్ అవుతుంది. సో భగవంత్ కేసరి అనుకున్న తేదికి అంటే అక్టోబర్ 19 న పక్కాగా థియేటర్స్ లో వచ్చేస్తుంది అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.