Advertisementt

రెండో వారానికే ఇంత నీరసమా?

Mon 18th Sep 2023 11:00 AM
nagarjuna  రెండో వారానికే ఇంత నీరసమా?
Bigg Boss 7 sunday episode highlights రెండో వారానికే ఇంత నీరసమా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 మొదలై రెండు వారాలైంది. రెండు వారాల్లో ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసి పంపించేశారు. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వారంతా గత సీజన్ లో మాటలతో రెచ్చిపోయి, ఎమోషనల్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అయిన కౌశల్, ఇనాయా లాగ ప్రతి ఒక్కరూ బిహేవ్ చేస్తున్నారు. అదంతా బిగ్ బాస్ ప్రేక్షకులకి రొటీన్ గా మారిపోయింది. కొత్తగా ఏమి లేదు, టాస్క్ లు బోర్, గొడవలు చూస్తే చిరాకు అనేలా ఉన్నాయి.

ఇక వీకెండ్ నాగార్జున ఎపిసోడ్స్ అయితే పరమ రొటీన్ గా తయారయ్యాయి. ఐదు రోజుల్లో జరిగిన గొడవలపై నాగార్జున క్లాస్ ఎప్పటిలాగే యాజిటీజ్ గా ఉంటే.. సండే ఎపిసోడ్ మరింత బోర్ కొట్టించేసింది. కొత్త ఆట లేదు. నాగార్జున కూడా పరమ బోరింగ్ హోస్టింగ్ తో కనిపిస్తున్నారు. శని, ఆదివారాల ఎపిసోడ్స్పై ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. నాగార్జున వస్తున్నారంటే ఏం జరగబోతుందో అనే క్యూరియాసిటీని బిగ్ బాస్ లీకులు చెరిపేస్తున్నాయి.

కేవలం రెండు వారాలకే బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ ని చూసి ఇంతిలా బోర్ కొడుతోంది.. ఏమాత్రం ఆసక్తిగా లేదు అంటూ కామెంట్ చెయ్యడం చూస్తే ఈ సీజన్ 7 చివరి వరకు ఎలా సాగుతుందో చూడాలి. 

Bigg Boss 7 sunday episode highlights:

Bigg Boss 7 Nagarjuna

Tags:   NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ