Advertisementt

చిరుకు జోడిగా అనుష్క

Mon 18th Sep 2023 09:36 AM
anushka shetty  చిరుకు జోడిగా అనుష్క
Anushka may romance with Chiranjeevi చిరుకు జోడిగా అనుష్క
Advertisement
Ads by CJ

బరువు విషయంలో బాధపడుతున్న అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి మూవీ హిట్ తో ఎంజాయ్ చేస్తుంది. తదుపరి అనుష్క మలయాళం మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే అనుష్క కొన్నాళ్లుగా సినిమాకి సినిమాకి చాలా గ్యాప్ ఇచ్చుకుంటూ వస్తుంది. ఆమె బరువు ఆమెని ఇబ్బంది పెడుతున్న కారణంగా సీనియర్ హీరోలు కూడా అనుష్క వైపు చూడలేదు. అనుష్క హీరోయిన్  ఇచ్చిన కొత్తల్లోనే వెంకీ, బాలయ్య, నాగార్జున లాంటి సీనియర్స్ సరసన నటించేసింది.

ఇప్పుడు మెగాస్టార్ సరసన అనుష్క ఫస్ట్ టైమ్ జోడి కట్టబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. అనుష్క.. మెగాస్టార్ చిరు-వసిష్ఠ మూవీలో హీరోయిన్ గా ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అంటూ వార్తలొస్తున్నాయి. చిరు కి అనుష్క అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వుద్ది అని మేకర్స్ డిసైడ్ అవడమే కాకుండా.. చిరంజీవి ప్రత్యేకంగా మిస్ శెట్టిని అందుకే వీక్షించారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటికే అనుష్క తో దర్శకుడు వసిష్ఠ చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. మరి చిరుతో అనుష్క పెయిర్ బావుంటుంది.. అంటూ మెగా ఫాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక కళ్యాణ్ కృష్ణ మూవీ కోసం చిరు సరసన త్రిష ని హీరోయిన్ గా అనుకుంటున్నారు. మెగాస్టార్-కళ్యాణ్ కృష్ణ మూవీ విషయంలో కొద్దిగా సందిగ్దత నెలకొంది. ముందుముందు ఏమవుతుందో చూడాలి. 

Anushka may romance with Chiranjeevi:

Anushka Shetty may romance with Chiranjeevi in upcoming movie

Tags:   ANUSHKA SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ