Advertisementt

బిగ్ బాస్7: ఈవారం వెళ్ళింది ఎవరంటే..

Sun 17th Sep 2023 08:38 PM
shakeela  బిగ్ బాస్7: ఈవారం వెళ్ళింది ఎవరంటే..
Bigg Boss 7: Who went this week.. బిగ్ బాస్7: ఈవారం వెళ్ళింది ఎవరంటే..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 మొదలై రెండు వారాలైంది. పెద్దగా పేరున్న కంటెస్టెంట్స్ ఎవరూ ఈసారి హౌస్ లోకి రాలేదు. షకీలా, శివాజీ.. అలాగే మిగతా వారు చాలామంది సీరియల్ ఆర్టిస్ట్ లు, మోడల్స్ ఇలా ఉన్నారు. ఇక ఆట సందీప్ ఒక్కడే బాగా తెలిసిన మోహము. హౌస్ లో ఎవరి గేమ్ వారిదే. కొట్లాటలు, గోల, రచ్చ ఇలా బిగ్ బాస్ హౌస్ మొత్తం గోల గోలే. గత రాత్రి శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కొంతమందికి క్లాస్ పీకారు. రెడ్ లో అంటే ఆట తీరు బాగోని వారికి వార్నింగ్ ఇచ్చారు. 

ఇక హౌస్ లో ఉన్న14 మందిలో గత వారం మొదటగా కిరణ్ రావు ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరో అందరూ ఓ అంచనాకు వచ్చేసారు. ఈ వారం జబర్దస్త్ తేజ కానీ, లేదంటే షకీలా కానీ ఎలిమినేట్ అవుతారని భావించారు. షకీలా టాస్క్ ఆడలేకపోతుంది. వయసు ప్రాభావం. ఇక తేజ నిద్ర తప్ప ఆట లేదు. 

అయితే ఈవారం శివాజీ కెప్టెన్ అవ్వగా.. ఫైనల్ గా షకీలా ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడినట్లుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో షకీల ఎలిమినేషన్ ని నాగార్జున రివీల్ చెయ్యబోతున్నారు.ఎప్పటిలాగే ఈవారం కూడా ఎవరు ఎలిమినేట్ అయ్యారో అనేది బిగ్ బాస్ లీకుల ద్వారా బయటపడిపోయింది. 

Bigg Boss 7: Who went this week..:

Shakeela eliminated from Bigg Boss Telugu 7 this week

Tags:   SHAKEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ