భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాల సెట్స్ నుంచి ఫొటోస్, వీడియోస్ లీకవడంపై ఆయా చిత్ర యూనిట్ లు టెన్షన్ పడుతుంటే.. కొంతమంది మాత్రం వాటిని వైరల్ చేస్తూ పైశాచికానందం పొందుతారు. మరోపక్క ఆ లీకులు ఆపేందుకు మేకర్స్ నానా పాట్లు పడతారు. కొంతమంది లీగల్ గా ప్రోసీడ్ అవుతారు. తాజాగా గేమ్ ఛేంజర్ లీకుల విషయంలో దిల్ రాజు ఇలానే లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు. సినిమా సెట్స్ నుంచి లీక్ చేసిన వారిపై లీగల్ గా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
అయితే తాజాగా ప్రభాస్-నాగ్ అశ్విన్ ల కల్కి 2898 AD మూవీ నుంచి యాక్షన్ సీక్వెన్స్ లోని ఒక ఫోటో లీకవడంపై చిత్ర బృందం చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. కల్కి ఫోటోని లీక్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాదు.. వారికి బిగ్ షాకిచ్చేలా కల్కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కల్కి నుంచి లీకైన పిక్ కల్కి మూవీకి విఎఫెక్స్ వర్క్ చేస్తున్న కంపెనీ నుంచే బయటికి వచ్చింది అని గ్రహించిన మేకర్స్ వారిపై చట్టపరమైన చర్యలకి సిద్దమవుతున్నారట.
ప్రస్తుతం కల్కి విఎఫెక్స్ వర్క్ నుంచి ఆ కంపెనీని తొలగించడమే కాకుండా.. వైజయంతి మూవీస్ వారు సదరు కంపెనీపై పరువును నష్టం దావా వేసేందుకు సిద్దమయ్యారట. అంటే ఈ కేసు వలన సదరు విఎఫెక్స్ కంపెనీ చాలా నష్టపోవాల్సి వస్తుంది అని తెలుస్తోంది. మరి ఇలాంటి లీకులు మరొకరు చెయ్యాలంటే భయపడేలా ఈ మాత్రం చర్యలు అవసరమే.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.