చంద్రబాబు అప్రమిత్రుడు రజినీకాంత్ రాజమండ్రి జైల్లో ఆయన్ని మీటవ్వడానికి నిన్న శనివారం వెళుతున్నటుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రజినీకాంత్-చంద్రబాబు మంచి స్నేహితులు. చంద్రబాబు స్కిల్ డెవెలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఆయనతో రజినీకాంత్ ములాఖత్ అవుతున్నారని అన్నారు. కానీ రజినీకాంత్ చంద్రబాబుని మీటవ్వలేదు.
దానితో ఇదంతా రూమర్. కావాలనే ఎవరో దీనిని స్ప్రెడ్ చేసారు అన్నారు. తాజాగా రజినీకాంత్ చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. అక్కడ మీడియా వారు రజినీకాంత్ ని చంద్రబాబుని మీటవ్వడానికి మీరు రాజమండ్రి వెళుతున్నారని వార్తలొచ్చాయి అందులో నిజమెంత అని అడగగా.. దానికి సూపర్ స్టార్ కూడా చంద్రబాబునాయుడు ని కలవాలనుకున్నా.. కానీ కుటుంబ శుభకార్యం వల్ల కోయంబత్తూర్ కి వెళ్లాల్సి వస్తుంది.. అంటూ సమాధానమిచ్చారు.
రజినీకాంత్ చంద్రబాబు ని మీట్లయితే ఏపీ రాజకీయాల్లో కొత్త ఒరవడి మొదలవుతుంది అని టీడీపీ నేతలు, కార్యాకర్థలు అనుకున్నారు. కానీ రజినీకాంత్ కొన్ని కారణాల వలన మిత్రుడు చంద్రబాబుని కలవలేకపోయినట్లుగా ఆయనే చెప్పారు.