జూన్ 20 న మెగా స్టార్ చిరంజీవికి మనవరాలు పుట్టింది. రామ్ చరణ్-ఉపాసనలు పాపకి జన్మనిచ్చారు. అయితే అపోలో ఆసుపత్రిలో జన్మించిన మె గాస్టార్ మనవరాలు అక్కడినుండి అమ్మమ్మ అంటే శోభన కామినేని ఇంటికి వెళ్ళింది. మొయినాబాద్ లోని ఉపాసన పుట్టింట్లోనే మెగాస్టార్ మనవరాలి బారసాల వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పాపకి క్లీంకార గా నామకరణం చేసారు.
ఇక క్లీంకార జన్మించి మూడు నెలలు పూర్తి కావోస్తుండడంతో.. మూడో నెలలోనే పాప క్లీంకార తో పాటుగా ఉపాసన మొదటిసారిగా మెగాస్టార్ ఇంట్లోకి కాలు పెట్టబోతోంది. అంటే చిరు మనవరాలు మొదటిసారిగా తాతగారి ఇంటికి రాబోతుంది. మరి రామ్ చరణ్ కి పాప పుట్టకముందే ఉపాసన-చరణ్ లు మెగాస్టార్ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. తన పాపకి తాత-నాన్నమ్మల ప్రేమ కావాలి అని ఉపాసన చెప్పింది.
ఇకపై క్లీంకార మెగాస్టార్ ఇంట్లోనే సందడి చేయబోతుంది. మరి మెగాస్టార్ చిరు-సురేఖలు మానవరాలితో టైమ్ స్పెండ్ చెయ్యబోతున్నారు. రామ్ చరణ్-ఉపాసన ఈమధ్యనే చిన్నపాటి వెకేషన్ కి వెళ్లొచ్చారు. ఆ తర్వాత మంచిరోజు చూసుకుని ఈరోజు సెప్టెంబర్ 17 న కుమార్తెతో మెగాస్టార్ ఇంటికి పయనమయ్యారు.