Advertisementt

బాలయ్య అభిమానులకి గుడ్ న్యూస్

Sun 17th Sep 2023 02:25 PM
bhagavanth kesari  బాలయ్య అభిమానులకి గుడ్ న్యూస్
Good news for Balayya fans బాలయ్య అభిమానులకి గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బాలకృష్ణ తన బావ, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు జైల్లో ఉండడంతో విజయవాడ-రాజమండ్రి అంటూ తిరుగుతున్నారు. అక్క భువనేశ్వరికి, కుమర్తె బ్రాహ్మణికి అండగా ఉంటున్న బాలకృష్ణ తాను చేస్తున్న భగవంత్ కేసరి షూటింగ్ ని పక్కనబెట్టడంతో.. ఆ సినిమాకి సంబందించిన కొద్దిపాటి షూటింగ్ బాలన్స్ ఉంది.. అంటే రిలీజ్ తేదీ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందేమో అంటూ నందమూరి అభిమానులు కాస్త ఆందోళనపడుతున్నారు. 

తాజా సమాచారం ప్రకారం బాలయ్య అభిమానులెవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అంటున్నారు. అంటే భగవంత్ కేసరికి సంబందించిన చిన్నపాటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే బ్యాలెన్స్ వుంది.. మిగతా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది, అంతే కాకుండా సినిమాకి సంబందించిన డబ్బింగ్ కూడా పూర్తయిపోయింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా చెన్నయ్ నుంచి వచ్చిన టీమ్ తో ప్రసాద్ ల్యాబ్ లో ఆర్ఆర్ వర్క్ స్టార్ట్ చేసాడు. 

అక్టోబర్ 12 కు అన్ని పనులు పూర్తి చేసి అనిల్ రావిపూడి అనుకున్న సమయానికి అంటే దసరా అక్టోబర్ 19 కి భగవంత్ కేసరిని రిలీజ్ చెయ్యడం పక్కా అంటూ వినిపిస్తున్న వార్తలతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు.  

Good news for Balayya fans:

Bhagavanth Kesari nearing completion

Tags:   BHAGAVANTH KESARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ