Advertisementt

NTR కి సైమా అవార్డు: మెగా ఫాన్ రియాక్షన్

Sun 17th Sep 2023 12:07 PM
jr ntr  NTR కి సైమా అవార్డు: మెగా ఫాన్ రియాక్షన్
SIIMA Award to NTR: Mega Fan Reaction NTR కి సైమా అవార్డు: మెగా ఫాన్ రియాక్షన్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ లో కలిసి నటించిన రామ్ చరణ్-ఎన్టీఆర్ ఇద్దరూ సమఉజ్జిలుగానే నటించారు. కొంతమంది ఎన్టీఆర్ కేరెక్టర్ ఎక్కువ ఉంది అంటే.. కొంతమంది రామ్ చరణ్ కేరెక్టర్ ని రాజమౌళి హైలెట్ చేసారు అన్నారు. కొంతమంది ఇద్దరి యాక్టింగ్ పై సంతృప్తిగానే ఉన్నారు. ఆస్కార్ అవార్డు పై కూడా ఇరువురు అభిమానులు ముచ్చటగానే మాట్లాడుకున్నారు. 

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైమా 2023 లో ఆర్.ఆర్.ఆర్ లో భీమ్ కేరెక్టర్ కి గాను ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ ఈ అవార్డు ని దుబాయ్ లో జరిగిన సైమా వేడుకలో అందుకున్నాడు. అయితే రామ్ చరణ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు రాకపోయినా మెగా అభిమానులు పెద్దగా ఫీలవ్వలేదు. కొంతమంది కాస్త ఫీలైనా మరికొంతమంది మాత్రం ఏ అవార్డ్ అయినా నీకొచ్చినా మా చరణ్ బాబుకి వచ్చినా ఆ అవార్డు మా అందరికీ వచ్చినట్టే తారక్ అన్నా!! శుభాకాంక్షలు సామీ...!! అంటూ సోషల్ మీడియాలో తారక్ కి సపోర్ట్ గా మాట్లాడారు. 

నిజంగా ఎన్టీఆర్ కి అవార్డు వచ్చింది అని మెగా అభిమానులు కుళ్ళిపోకుండా.. ఏ అవార్డు అయినా మీ ఇద్దరికి వచ్చినట్టే అని సరిపెట్టుకోవడం మంచి పరిణామమే. ఈ విషయంలో మెగా అభిమానులని మెచ్చుకోవల్సిందే. 

SIIMA Award to NTR: Mega Fan Reaction:

Jr NTR on win at SIIMA for RRR

Tags:   JR NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ