కొన్నాళ్లుగా కీర్తి సురేష్ పెళ్లిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరే ఇతర హీరోయిన్ పై జరగలేదనే చెప్పాలి. ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో కీర్తి సురేష్ ప్రేమ, అతనితోనే కీర్తి సురేష్ పెళ్లి పెట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది అని, మరోసారి కీర్తి సురేష్ చిన్ననాటి స్నేహితుడు ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ ని వివాహము చేసుకోబోతుంది.. త్వరలోనే కుర్తి సురేష్ పెళ్లి ఉండబోతుంది అంటూ చాలా రకాలుగా కీర్తి సురేష్ వివాహంపై వార్తలు వినిపించాయి.
అయితే ఎప్పటికప్పుడు కీర్తి సురేష్ పేరెంట్స్ ఆమె పెళ్లి విషయాన్ని ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి కీర్తి సురేష్ తండ్రి అనిరుద్ తో కీర్తి సురేష్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కీర్తి-అనిరుద్ వివాహం చేసుకోబోతున్నారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఈ ప్రచారాలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. కీర్తి సురేష్ పై ఇలాంటి వార్తలు రావడం ఇదేమి మొదటిసారి కాదు.
ఈరకమైన వార్తలు చాలాసార్లు వచ్చాయి. కీర్తి, అనిరుద్ లపై ఎవరో కావాలనే ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారు. తప్పుగా సంకేతాలు పంపుతున్నారు. కావాలనే ఎవరో ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. అటు కీర్తి కూడా తాను అనిరుద్ కలిసి చాలా సినిమాల్లో పని చేసాము, మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ అనిరుద్ తో పెళ్లిపై స్పందించింది.