ఏపీలో వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు నోటికి అడ్డు అదుపు లేకుండా ప్రతిపక్షాలను, నాయకులని మాట్లాడుతుంటారు. బూతు మంత్రులుగా కొంతమంది ప్రత్యేకంగా పేరు కూడా తెచ్చుకున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని నోటికొచ్చినట్లుగా మట్లాడుతూ ఉంటారు. వీరు మాట్లాడితే ఎలాంటి కేసు ఉండదు. అదే ప్రతిపక్షాలు మాట్లాడితే వారిపై కేసులు. ప్రస్తుతం ఆంధ్రలో జరుగుతున్నది ఇదే అని అక్కడి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు.
అదలావుంటే రాజకీయం రాజకీయమే, పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫె. కానీ రాజకీయాలతో పర్సనల్ లైఫ్ ముడిపెట్టి మట్లాడడం ఎంత వరకు న్యాయం. అడిగేవాడు లేకపోతే ఏదైనా మట్లాడతారా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించగానే మిత్ర పక్షం బిజెపి కి విడాకులు ఇవ్వకుండా టీడీపీతో పెళ్లికి సిద్దమైన పవన్ కళ్యాణ్. ఒక భార్యకి విడాకులివ్వకుండానే మరో అమ్మాయితో సహజీవనం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహారం ఉంది. మిత్ర పక్షం బీజేపీతో ఇంకా తెగతెంపులు చేసుకోకుండానే టీడీపీతో జత కట్టాడు అంటూ నానారకాల మాటలు మాట్లాడుతున్నారు. వైసీపీ కి అనుకూల బ్లూ మీడియా మరింతగా రెచ్చిపోయి ఇలాంటి రాతలు రాస్తుంది.
మరి పెళ్లి, విడాకులు, సహజీవనం ఇలా నోటికొచ్చినట్లుగా మట్లాడడం, రాయడం ఇవన్నీ ఓకేనా.. మీరు మాట్లాడితే అవి నిజాలు, వేరే వాళ్ళు మాట్లాడితే అవి బూతులు. ఇదెక్కడి న్యాయం జగన్ గారు. ఆయన్నెందుకు అడుగుతారులే.. సీఎం హోదాలో ఉన్న జగన్ కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై కామెంట్స్ చేసే స్థాయికి దిగజారిపోయారంటూ జనసైనికులే కాదు, ఏపీ ప్రజలు చాలామంది కామెంట్స్ చెయ్యడం గమనార్హం.