వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఐదేళ్లుగా స్నేహంగా మెలిగిన ఈ జంట తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని ఎట్టకేలకి పెళ్ళికి సిద్ధమయ్యారు. జూన్ 9 న సింపుల్ గా నాగబాబు ఇంట్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు నవంబర్ లో వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.. డేట్ విషయం క్లారిటీ లేకపోయినా.. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా వీరి వివాహం ఉండబోతుంది.
పెళ్ళికి సమయం దగ్గరవడంతో ఈ మెగా కపుల్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు పెళ్లి దుస్తుల షాపింగ్ లో నిమగ్నమయ్యారు. నిన్న శనివారం మంచి రోజు కావడంతో లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ లు ఇద్దరూ జూబ్లీహిల్స్ లోని ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షాప్ కి వెళ్లి పెళ్లి దుస్తుల్ని చూసుకున్నారు. స్వయంగా మనీష్ మల్హోత్రానే వీరికి తమ దగ్గర ప్రత్యేకంగా ఉన్న వెడ్డింగ్ అవుట్ ఫిట్స్ ని చూపించారు.
మరి ఈ రెండు నెలలు లావణ్య-వరుణ్ తేజ్ ఇద్దరూ ఈ పెళ్లి కి సంబంధించిన పనులని స్వయంగా చూసుకోబోతున్నట్లుగా నిన్నటి సంఘటన తెలియజేస్తుంది. ఇక వీరి వివాహం ఇటలీలో కుటుంబ సభ్యులు, మరికొంతమంది స్నేహితులు, ఆత్మీయుల మద్యన అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లుగా సమాచారం.