ఇస్మార్ట్ శంకర్ ప్రభంజనంతో టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతుంది అనుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్ ని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. అంత అందాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు మూవీలో పని చేస్తుంది. కానీ ఆ చిత్రం ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో మేకర్స్ కూడా తెలియదు. అలాంటి సినిమాని నమ్ముకుంది.
మరోపక్క ప్రభాస్ - మారుతి మూవీలో నటిస్తుంది.. అనే న్యూస్ తప్ప.. అధికారిక ప్రకటన లేదు. ఇక తాజాగా నిధి అగర్వాల్ దుబాయ్ లో మెరిసింది. సైమా 2023 అవార్డు వేడుకలో స్పెషల్ డాన్స్ పెరఫార్మెన్స్ కోసం వెళ్ళింది. అక్కడ రెడ్ కార్పెట్ మీద అందాల ఆరబోతతో అదరగొట్టేసింది. మోడ్రెన్ అవుట్ ఫీట్ లో నిధి అగర్వాల్ చాలా క్యూట్ గా గ్లామర్ గా కనిపించింది.
నిజంగా పైన పిక్స్ లో నిధి అగర్వాల్ ని చూస్తే ఇంత అందాన్ని దర్శకనిర్మాతలు ఎవరూ పట్టించుకోరా అనడం ఖాయం.