పవన్ కళ్యాణ్ ఎప్పటినుంచో టీడీపీ-బీజేపీలతో కలిసి పోరాడి జగన్ ని గద్దె దించాలని బహిరంగంగానే చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వం వైజాగ్ లో చేసిన దారుణం తర్వాత చంద్రబాబు విజయవాడ లో పవన్ కళ్యాణ్ ని వెళ్లి కలిసాక వీరి పొత్తు ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అయినట్లే అనుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ ప్రతి పక్షాలన్నీ కలిసి జగన్ పై యుద్ధం చేస్తాయి అని క్లారిటీ ఇచ్చారు. అయితే బహిరంగంగా చంద్రబాబు-పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోలేదు. జనసేనకు-టీడీపీకి సీట్ల విషయంలో పొసగకపోవడంతో అది హోల్డ్ లోనే ఉంది.
మరోపక్క బిజెపి కూడా పవన్ టీడీపీ తో కలిపే ప్రపోజల్ ఒప్పుకోకపోవడంతో వారి మైత్రిపై స్తబ్దత ఏర్పడింది. ఇలాంటి సమయంలో చంద్రబాబు అరెస్ట్ అవడంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ములాఖత్ అయ్యి బయటికొచ్చి టీడీపీ జనసేన కలిసి ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది అని బహిరంగంగానే పొత్తును ప్రకటించారు. మరి రాజమండ్రి జైల్లో ములాఖత్ సమయంలో ఏం జరిగి ఉంటుంది. పవన్ చంద్రబాబు ని ఈ పొత్తుకు ఎలా ఒప్పించారు.
చంద్రబాబు ఎన్ని సీట్స్ ఇస్తా అంటే పవన్ ఒప్పుకున్నారు.. లేదంటే పవన్ ఏమంటే అదే అని చంద్రబాబు ఒప్పుకున్నారా.. అసలు జనసేన ఎన్ని సీట్స్ అడిగింది. టీడీపీ ఎన్ని సీట్స్ ఇస్తా అంది. ఎలా పవన్ చంద్రబాబు ని ఒప్పించి ఉంటారు అనే విషయంలో చాలామందికి క్లారిటీ లేక తల పగలు గొట్టేసుకుంటున్నారు. మరోపక్క వైసీపీ కూడా జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై భగభగ మండిపోతుంది.