ఏ స్టార్ హీరో సినిమా అయినా అభిమానులకి ఆ సినిమా ఫస్ట్ లుక్ ఇచ్చే కిక్కు మాములుగా ఉండదు. అయితే ఆ ఫస్ట్ లుక్ లేట్ అయినా, లేదంటే అభిమానులు కోరుకున్న అప్ డేట్ లేట్ అయినా ఫాన్స్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. దానితో ఆ సెట్స్ నుండి ఏదైనా వీడియో కానీ పిక్ కానీ లీకైతే దానిని వైరల్ చేస్తూ ఉంటారు. అలా దిల్ రాజు-శంకర్-రామ్ చరణ్ ల గేమ్ చేంజర్ నుంచి చాలా వీడియోస్, ఫొటోస్ లీకై సెన్సేషన్ క్రియేట్ చేసాయి.
ఇప్పుడు కూడా గేమ్ చేంజర్ నుంచి ఓ సాంగ్ లీకైంది. జరగండి జరగండి అంటూ సాగే లిరిక్స్ తో ఉన్న సాంగ్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గేమ్ చెంజర్ టీంకి ఇది పెద్ద షాక్ అయినా.. వారు ఆ సాంగ్ ఏయే ఛానల్స్ లో ఉందో దానిని డిలేట్ చేయిస్తున్నా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కోసం తెగ వెయిట్ చేస్తున్న మెగా ఫాన్స్ కి ఈ సాంగ్ లిరిక్స్ బూస్ట్ లా పని చేసాయి. మరి 15 కోట్లు పెట్టి తీసిన ఈపాట ఇలా లీకైతే దిల్ రాజుగారు ఏం చేస్తున్నారో అని మాట్లాడుకుంటున్నారు.
అసలు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇవ్వకపోతే ఇలాంటివే జరుగుతాయి. టీం కూడా కాస్త గట్టిగా కట్టుదిట్టమైన జాగ్రత్తలు చెయ్యకపోతే.. సినిమా విడుదల సమయానికి ఎంతో కొంత డ్యామేజీ తప్పదు. శంకర్ ఏమో అటు ఇండియన్ 2 ఇటు గేమ్ చేంజర్ అంటూ ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ సమయంలోనే ఇలాంటి లీకులు షాకిస్తూ పోతున్నాయి.