జబర్దస్త్ ఫైమా ఇపుడు బిగ్ బాస్ పిల్లగా మారిపోయింది. జబర్దస్త్ లో అందం లేకపోయినా టాలెంట్ ముఖ్యం అని నిరూపించిన ఫైమా బుల్లెట్ భాస్కర్ స్క్రిప్ట్ లో బాగా ఫేమస్ అయ్యింది. గత ఏడాది బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన టాలెంట్ తో విల్ పవర్ తో టాప్ 5 వరకు వచ్చి ఎలిమినేట్ అయ్యింది. ఆతర్వాత సూర్య తో కలిసి బీబీజోడిలో అదరగొట్టేసింది.
కామెడీ, డాన్స్ ఇలా ప్రతి విషయంలోను ఫైమా యాక్టీవ్ గా కనబడుతుంది. అయితే బిగ్ బాస్ కి వెళ్లి ఏడాది కాకముందే ఫైమా కొత్తిల్లు కొని తన తల్లితో పాటుగా గృహ ప్రవేశం చేసింది. తన తల్లి కోసం ఓ కొత్తిల్లు కొనుక్కోవాలంటూ ఫైమా చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా ఫైనల్ గా ఫైమా కొత్తిల్లు కొనేసి గృహ ప్రవేశం చేసేసింది. తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. తన కొత్తిల్లుని చూపిస్తూ ఫైమా దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరి బిగ్ బాస్ నుంచి వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాకూండానే ఫైమా కొత్తింట్లో అడుగుపెట్టింది. కష్టే ఫలి అనేది ఫైమా విషయంలో నిజమైంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.