టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఆయన్ని కలిసేందుకు ఫ్యామిలీ మెంబెర్స్ భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి ఈ బుధవారం వెళ్లగా.. గురువారం జనసేన నేత పవన్ కళ్యాణ్ బాలయ్య, లోకేష్ లో కలిసి వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ అయ్యి బాబుకి పవన్ సంఘీభావం తెలియజెయ్యడమే కాకుండా.. టిడిపి-జనసేన పొత్తుని అధికారికంగా అనౌన్స్ చేసారు. ఈ రోజు భువనేశ్వరి భర్తని కలిసేందుకు అనుమతి అడగగా.. దానికి అధికారులు నిరాకరించారు.
నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిన ఆయన మిత్రుడు సూపర్ స్టార్ రజినీకాంత్ నారా లోకేష్ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పి తన మిత్రుడు త్వరలోనే బయటికొస్తారని చెప్పారు. ఇక తాజాగా రేపు శనివారం సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబుతో ములాఖత్ అవ్వబోతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలోనే కాదు.. ప్రముఖ ఛానల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆయన చెన్నై నుంచి రాజమండ్రి కి వెళ్లి చంద్రబాబుని రాజమండ్రి జైలులో కలుస్తారని అంటున్నారు.
మరోపక్క రేపు చంద్రబాబుతో రజనీ కాంత్ ములాఖత్ పై వచ్చిన వార్తలను ఖండించిన ఆయన కార్యాలయ వర్గాలు. రజనీకాంత్ ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నారని.. రాజమండ్రి వచ్చే షెడ్యూల్ ఏదీ లేదని స్పష్టం చేసిన వ్యక్తిగత సిబ్బంది. ఏపిలో మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని సూచన అంటూ సోషల్ మీడియాలో మరో వార్త వినిపిస్తుంది.
మరి రేపు సూపర్ స్టార్ గనక రాజమండ్రి వెళ్లి చంద్రబాబు ని మీటయితే అది ఖచ్చితంగా టిడిపి కి అనుకూలంగా మారడం ఖాయం.