యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీతో కలిసి కనిపిస్తే ఎన్టీఆర్ అభిమానాలకు, నందమూరి అభిమానులకి ఎక్కడలేని సంతోషం వచ్చేస్తుంది. హీరోగా స్టార్ రేంజ్ కి ఎదిగిన ఎన్టీఆర్ ని నందమూరి కుటుంభం పెద్దగా పట్టించుకోదు. గతంలో నందమూరి ఫ్యామిలీ అభిమానం కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ కూడా కొన్నాళ్లుగా (హరికిష్ణ మరణం తర్వాత) అన్న కళ్యాణ్ రామ్ తో కలిసిపోయి ఉన్నాడు. కానీ నందమూరి కుటుంభముతో అంటీముట్టనట్టుగానే కనబడుతున్నాడు.
ఈమధ్యన పెద్దాయన సీనియర్ ఎన్టీఆర్ 100 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ని పట్టించుకోని ఎన్టీఆర్, ఇప్ప్పుడు కూడా చంద్రబాబు అరెస్ట్ పై నోరు విప్పకపోవడం నందమూరి అభిమానులను కెలికేస్తోంది. ఇక కొంతమంది ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకునే వారు.. ఎన్టీఆర్ ని విమర్శిస్తున్నారు. తాజాగా ఓ అభిమాని ఇలా ఓ ప్రెస్ నోట్ ని వదిలాడు. మా వాడివే... కానీ... మాలో ఒక్కడివి కాలేవు. ఇంక అంతే !!! @tarak9999 అంటూ ఆ నోట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
ఆ నోట్ లో ఇలా ఉంది.
గతంలో నిన్ను ప్రాణంలా ప్రేమించిన ఓ అభిమానిని.
ఇప్పుడు కేవలం నందమూరి కుటుంభం సభ్యుడిగా నిన్ను గౌరవిస్తున్నా అంతే.
వాడెవడో కొత్తగా వచ్చి సపోర్ట్ చేసాడని, లేదా నీ అవసరం మాకు లేదు అని నిన్ను వదిలెయ్యలేదు, నిన్ను అభిమానించడం మానలేదు.
మా హరన్న లో ఉన్న తెగింపు
మా రామన్నలో ఉన్న ఆవేశం
మా బాలయ్య లో ఉన్న ధైర్యం కనిపించక, నీలో ఉన్న మొండితనం భరించలేక, నీ లోతైన మనస్తత్వాన్ని అర్ధం చేసుకోలేక, నీ మౌనం సహించలేక, నీ మీద ప్రేమని నాకు నేనుగా చంపేసుకున్నా, సగడు సినీప్రేక్షకుడిగా నీ సినిమా చూస్తాను, అంతవరకే.
సంతోషంగా ఉంది.. థాంక్యూ నమస్తే అంటూ రాసిన లెటర్ చూస్తే ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకులే ఇతను ఎన్టీఆర్ ప్రవర్తనతో బాగా హార్ట్ అయ్యి ఉన్నాడనిపించకమానదు.