రామ్ మొదటిసారిగా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో స్కంద తో ప్యాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. స్కందని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. రామ్-శ్రీలీల జంటగా ఇప్పటికే విడుదలైన సాంగ్స్ యూత్ ని ఊపేస్తున్నాయి. అయితే ఈ నెల 15 అంటే ఈరోజు శుక్రవారం స్కంద విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన ఆ సినిమాని ఈనెల 28 కి షిఫ్ట్ చేసారు.
అయితే స్కంద ట్రైలర్ విడుదలయ్యాక చాలా రకాల విమర్శలు వచ్చాయి. అందుకే రిలీజ్ కి ముందు మరో ట్రైలర్ వదులుతారని అనుకున్నారు. మరి స్కంద ని ప్యాన్ ఇండియా రిలీజ్ అన్నారు. అందుకు అనుగుణంగా ప్రమోషన్స్ కనిపించడం లేదు. స్కంద విడుదలకు కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్ లోనే ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.
ఇక ప్యాన్ ఇండియా ప్రమోషన్స్ కి సమయం ఎక్కడుంటుందని. ప్యాన్ ఇండియా రిలీజ్ అంటే సరిపోదు దానికి సంబంధించి ప్రమోషన్స్ ఉండాలి, అన్ని భాషల ప్రేక్షకులకి సినిమా రీచ్ అయితేనే అది హిట్ అవుతుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయిన చాలా సినిమాలు ప్యాన్ ఇండియా మార్కెట్ లో వెలవెలబోయాయి. మరి రామ్-బోయపాటి ఆ వే లో అలోచించి ప్రమోషన్స్ మొదలు పెడితే ఓకె.. లేదంటే కష్టం సుమీ..!