Advertisementt

ఈరోజే ప్రభాస్ కి మోకాలి సర్జరీ ?

Fri 15th Sep 2023 12:38 PM
prabhas  ఈరోజే ప్రభాస్ కి మోకాలి సర్జరీ ?
Prabhas has knee surgery today? ఈరోజే ప్రభాస్ కి మోకాలి సర్జరీ ?
Advertisement
Ads by CJ

ప్రభాస్ రెండు రోజుల క్రితమే వెకేషన్స్ అంటూ ఓ 15 రోజుల పాటు సినిమా షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని యూరప్ వెళ్ళాడు. అయితే ప్రభాస్ ఎంజాయ్ చెయ్యడానికి, వర్క్ ప్రెజర్ నుండి రిలాక్స్ అవడానికి యూరప్ వెళ్లాడని చాలామంది అనుకున్నారు. కానీ ప్రభాస్ సినిమా షూటింగ్స్ అన్ని పక్కనబెట్టి యూరప్ వెళ్ళింది తన మోకాలికి శస్త్ర చికిత్స కోసమంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. 

Prabhas knee surgery today, hope it goes well 🤞 అంటూ ప్రభాస్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో ఇలా ట్వీట్ చేసారు. గతంలోనూ ప్రభాస్ మోకాలికి సర్జరీ చేయించుకున్నాడనే న్యూస్ నడిచింది. ఆదిపురుష్ టీజర్ అప్పుడు ప్రభాస్ అస్సలు నడవలేకపోతే హీరోయిన్ కృతి సనన్ సపోర్ట్ తీసుకుని నడిచిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు మరోసారి ప్రభాస్ మోకాలి సర్జరీ కోసమే యూరప్ వెళ్ళాడు. వెకేషన్ కోసం కాదు.. అంటూ అభిమానులు ఈ సర్జరీ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక ఓ 15 రోజులపాటు ప్రభాస్ యూరప్ లోనే ఉంటాడని.. తర్వాత ఇండియాకి వచ్చి కొద్దిపాటి రెస్ట్ తర్వాతే ఆయన తన సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. 

Prabhas has knee surgery today?:

Prabhas to take a break for knee surgery? 

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ