Advertisementt

బేబీ సినిమాపై డ్రగ్స్ ఇష్యూ

Thu 14th Sep 2023 08:21 PM
baby movie  బేబీ సినిమాపై డ్రగ్స్ ఇష్యూ
Hyderabad CP CV Anand Serious In Baby Movie బేబీ సినిమాపై డ్రగ్స్ ఇష్యూ
Advertisement
Ads by CJ

అదేమిటి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయ్యి.. ఓటిటిలోను అదిరిపోయే రెస్పాన్స్ అందుకుని.. టీవీ ప్రీమియర్స్ కి సిద్దమైన బేబీ సినిమాపై సీవీ ఆనంద్‌ సీరియస్ అవడమేమిటా అనుకుంటున్నారా.. ప్రస్తుతం హైదరాబాద్ ని డ్రగ్స్ కేసు ఊపేస్తోంది. మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో దొరికిన డ్రగ్స్, అలాగే రీసెంట్ గా హైదరాబాద్ లోని ఫేమస్ టిఫిన్ సెంటర్ అయిన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ డ్రగ్స్ కేసులో దొరకడంతో.. బేబీ సినిమాపై ఆనంద్ ఫైర్ అయ్యారు. 

బేబీ సినిమాలో ఓ పబ్ లో డ్రగ్స్ ఏవిధంగా ఉపయోగించాలనే సన్నివేశాలను కూలంకషంగా చూపించారు.. మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో దాడులు చేసినప్పుడు అక్కడ బేబీ సినిమాలో పార్టీ జరిగిన తీరులా కనిపించింది, ఇలాంటి దృశ్యాలను సినిమాల్లో చూపించవద్దని, వ్యాప్తి చేయవద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం.. బేబీ సినిమాలో ఇలాంటి సన్నివేశాలను చూపించినందుకు వాళ్లకు నోటీసులు ఇస్తాం.. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుంది అంటూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు. 

Hyderabad CP CV Anand Serious In Baby Movie :

Hyderabad CP CV Anand Serious In Baby Movie Over Drug Scene

Tags:   BABY MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ