పవన్ కళ్యాణ్ నేడు టీడీపీతో పొత్తు ఉంటుంది అంటూ అధికారిక ప్రకటన చేసారు. ఎప్పటినుండో జనసేనతో టీడీపీ కలుస్తుంది అంటూ ప్రచారం జరగడం కాదు.. పవన్ కళ్యాణ్ ఆ సంకేతాలు చంద్రబాబు కి ఎప్పటినుండో పంపుతున్నారు. కానీ ఎవరికి ఎన్ని సీట్స్ అంటూ జరిగిన చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో జనసేన-టీడీపీ పొత్తు అనేది కొలిక్కి రావట్లేదు. ఇక ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉండడంతో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చంద్రబాబుకి సపోర్ట్ చేసారు.
కానీ ఈరోజు లోకేష్, బాలయ్య లతో కలిసి చంద్రబాబుని కలిసి ములాఖత్ అయిన పవన్ కళ్యాణ్ లోపే ఏం జరిగిందో తెలియదు కానీ బయటికొచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఇప్పటివరకు అనుకున్నది టీడీపీతో పొత్తు ఉంటుంది అని.. కానీ ఇప్పుడు చెబుతున్నాను టీడీపీ-జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాము, వైసీపీ కి ఇదే సవాల్ అంటూ పవన్ కళ్యాణ్ వార్ ని షురూ చేసారు.
అయితే మెగా ఫాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మిక్స్డ్ రెస్పాన్స్ ని వ్యక్తం చేస్తున్నారు. అందులో ఓ మెగా అభిమాని ఇలా ట్వీట్ చేసాడు. ఇంక నా ఓటు వైయస్సార్సీపికే.... నేను టిడిపి వ్యతిరేకిని అందుకే నేను టిడిపిని సమర్ధించను. మా అన్నయ్య @KChiruTweets చెబితే మాత్రం కచ్చితంగా ఓటు వేస్తా.... #YSRCP.. #TDP.. #JanaSenaParty.
కొంతమంది పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు, మరికొందరు ఇలా కామెంట్స్ చేస్తున్నారు.