చాలామంది సౌత్ హీరోయిన్స్ కి ఫైనల్ టార్గెట్ హిందీనే. అక్కడ బాలీవుడ్ లో సక్సెస్ సాధించి అక్కడే చక్రం తిప్పతూ సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. అందుకు అనుగుణంగానే హిందీలో కాలు పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అలా వెళ్లిన వారిలో ఆసిన్, త్రిష, కాజల్, తమన్నా ఇంకా చాలామందే ఉన్నారు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతారకి ఎన్ని హిందీ ఆఫర్స్ వచ్చినా ఆమె నార్త్ వైపు చూడలేదు.
తాజాగా తమిళ దర్శకుడు అట్లీ హిందీ లో చేసిన జవాన్ తో నార్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. హిందీలో అలాంటి ఇలాంటి ఎంట్రీ కాదు బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది నయనతార, జవాన్ లో నయన్ లుక్స్ కి, యాక్టింగ్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ సినిమా కేవలం 7 రోజుల్లో 600 కోట్లు కొల్లగొట్టడం కూడా నయన్ కి బాగా కలిసొచ్చింది. దానితో డెబ్యూ మూవీతోనే నయనతార అదిరిపోయే ఎంట్రీ ఇచ్చినట్టయ్యింది.
ఇక ఈ చిత్రం తర్వాత నయనతారకి బాలీవుడ్ స్టార్ హీరోల అవకాశాలు క్యూ కట్టడం ఖాయం. మరి నయన్ ఒప్పుకుంటుందో లేదో, అనేది ఇప్పుడు అందరిలో క్యూరియాసిటీగా మారిన విషయం. పారితోషకం ఎక్కువ ఇస్తా అన్నా నయన్ ఒప్పుకోవాలిగా అంటున్నారు. చూద్దాం నయన్ నెక్స్ట్ హిందీ మూవీ ఏమై ఉంటుందో అనేది.