నిన్నమొన్నటివరకు అయితే రాజకీయాలు, లేదంటే సినిమాలు అన్నట్టుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ రెండిటిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తున్నారు అనిపించేలా ఆయన కదలికలు ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో యాక్టీవ్ కాగానే.. సినిమాలు పక్కనబెట్టేసే పవన్.. సినిమాలు షూటింగ్స్ చేస్తే రాజకీయాలను లైట్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం అటు రాజకీయాలని, ఇటు సినిమా షూటింగ్స్ అన్ని జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు.
గత వారం రోజులుగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల్లో పవన్ కల్యాణ్ పాత్ర స్పష్టంగా కనబడనుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి డైరెక్ట్ గానే మద్దతునిస్తూ నేడు రాజమండ్రి జైలులో ఆయన్ని మీటయ్యేందుకు హైదరాబాద్ నుండి రాజమండ్రికి వెళ్లారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు విజయవాడలో ధర్నా చేసారు.
ఇక గత రెండు రోజులుగా హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈరోజు గురువారం చంద్రబాబుతో ములాఖత్ తర్వాత బాలయ్య-భువనేశ్వరిలతో భేటీ ఉండబోతుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యధావిధిగా షూటింగ్ కి వచ్చేస్తారు. హైదరాబాద్ లో వేసిన ఓ స్పెషల్ సెట్ లోనే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్లో చిత్రీకరణ మొదలు పెట్టాడు హరీష్. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పర్ఫెక్ట్ దారిలో వెళుతున్నట్టుగా జనసైనికులు మాట్లాడుకుంటున్నారు.