ఈ వారం సినిమాలకి మంచి లక్కీ ఛాన్స్ తగిలినట్టే. ఈ 15 న విడుదలైన సినిమాలకి లాంగ్ వీకెండ్ బాగా కలిసొచ్చింది. స్కంద సెప్టెంబర్ 15 న విడుదల కావాల్సి ఉండగా.. చిన్న చిన్న కారణాలతో అది ఈ నెల 28 కి పోస్ట్ పోన్ అయ్యింది. లేదంటే స్కంద హడావిడి కనిపించేది. ఇక రేపు తెలుగు నుండి ఛాంగురే బంగారు రాజా, రామన్న చౌదరి అనే రెండు చిన్న సినిమాలతో పాటుగా.. విశాల్ మార్క్ ఆంటోని విడుదలవుతుంది.
పెద్ద సినిమాలేవన్నా విడుదలైనట్టయితే ఈ లాంగ్ వీకెండ్ కలిసిచ్చేది. శని, ఆదివారాలు వీకెండ్, సోమవారం కొన్నిచోట్ల వినాయకచవితి హాలిడే. మరికొంతమందికి మంగళవారం హాలిడే. అలా ఈ లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకోవడంలో కొంతమంది విఫలమయ్యారు. లేదంటే ఈ మూడు రోజుల సెలవలు బాగాకలిసొచ్చేవి. ఇంత పెద్ద లాంగ్ వీకెండ్ ని చాలామంది సింపుల్ గా వదిలేసుకున్నారు.